అనిల్ సుంకర ఇంటర్వ్యూ...

Tuesday,December 31,2019 - 02:46 by Z_CLU

‘సరిలేరు నీకెవ్వరు…’ సినిమా ప్రమోషన్స్ బిగిన్ అయ్యాయి. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ తో సహా కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు నిర్మాత అనిల్ సుంకర. భారీ అంచనాల మధ్య సంక్రాంతి బరిలోకి దిగనున్న ‘సరిలేరు నీకెవ్వరు…’ ఎలా ఉండబోతుంది..? అభిమానులు ఈ సినిమా నుండి ఏం ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.. అనేది మీడియాతో చెప్పుకున్నారు. ఆ విషయాలు మీకోసం…

సెన్సార్ కి రెడీ…

డబ్బింగ్ దగ్గరి నుండి ప్రతీది కంప్లీట్ అయ్యాయి. సెన్సార్ ఒక్కటే బ్యాలన్స్… అది కూడా మరో 2 రోజుల్లో అయిపోతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. మహేష్ బాబుని అందరూ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూస్తారు.

విజయశాంతి గారు…

విజయశాంతి గారు మహేష్ బాబుతో నటించినప్పుడు ఆయనకు 13 ఏళ్ళు. మళ్ళీ ఇన్నాళ్ళకు వాళ్ళు కలిసి నటించారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఉండే సీన్స్ చాలా బావుంటాయి.

అనిల్ రావిపూడికి మించి…

అనిల్ రావిపూడి సినిమా అనగానే ఎంటర్ టైన్ మెంట్ గుర్తుకు వస్తుంది. కానీ ఈ సినిమాలో అంతకు మించి ఉండబోతుంది. ఈ సినిమా చూశాక శంకర్ సినిమా స్థాయిలో ఎంటర్ టైన్ మెంట్ చూసినట్టుగా ఉంటుంది.

అన్నీ అనుకున్నట్టుగానే…

ఎప్పుడైతే సినిమా సంక్రాంతికి అని ఫిక్సయ్యామో అన్నీ కుదిరాయి. ప్రతీది చకచకా ప్లాన్ ప్రకారంగా ఫినిష్ అయ్యాయి.

సినిమా మొత్తం అంతే…

సినిమా చూస్తున్నంత సేపు ఆడియెన్స్ క్లాప్ కొడుతూనే ఉంటారు. విజిల్స్ వేస్తూనే ఉంటారు. ఇవీ రెండూ కాకుండా ఉన్నారంటే ఎమోషన్ కి కన్నీళ్లు పెట్టుకుంటారు.

మెగా సూపర్ ఈవెంట్…

అటు మెగాస్టార్… ఇటు సూపర్ స్టార్ ఇద్దరూ కలిసి అటెండ్ అయిన వేదికలున్నాయేమో కానీ, ఇలా సూపర్ స్టార్ హోస్ట్ చేస్తుండగా, మెగాస్టార్ గెస్ట్ గా రావడం అన్నది జరగలేదు.

మహేష్ బాబు క్యారెక్టర్…

ఆర్మీ మేజర్ లా మహేష్ బాబు స్క్రీన్ పై ఎంతసేపు ఉంటాడన్నది పక్కన పెడితే, సినిమాలోని ప్రతి సిచ్యువేషన్ ఆయన ఆర్మీ మేజర్ అని గుర్తు చేస్తూనే ఉంటుంది.

కథలో భాగం కర్నూలు…

కర్నూల్ బ్యాక్ డ్రాప్ అనగానే ‘ఒక్కడు’ సినిమా గుర్తుకు వచ్చి ఉంటుంది కానీ, కర్నూలు అనేది కథలో భాగం అందుకే అవాయిడ్ చేయడం జరగలేదు. ఈ సినిమాకి ఆ సినిమాకి అస్సలు సంబంధం ఉండదు.

బడ్జెట్ మారింది…

ఇదే సినిమా సమ్మర్ కి రిలీజ్ అనుకుంటే బడ్జెట్ తగ్గి ఉండేది. సంక్రాంతికి అని ఫిక్సయ్యాం కాబట్టే బడ్జెట్ పెరిగింది. వర్షాలు పడుతున్నప్పుడు కూడా షూటింగ్ ఆగకుండా ఇన్ డోర్  షూటింగ్ ప్లాన్ చేసుకుని సినిమాని పూర్తి చేశాం. సంక్రాతి స్థాయి సినిమా ‘సరిలేరు…’

మహేష్ బాబు కోసమే…

దేవి శ్రీ ప్రసాద్ మహేష్ బాబును మైండ్ లో పెట్టుకునే సాంగ్స్ కంపోజ్ చేశాడు. ఈ సాంగ్స్ ఆడియో విన్న తరవాత ఆ ప్లేస్ లో మహేష్ బాబును తప్ప ఇంకొకరిని ఊహించుకోలేరు… అంత మంచి సాంగ్స్ ఇచ్చాడు. రీ రికార్డింగ్ కూడా సిచ్యువేషన్ కి తగ్గట్టు కంపోజ్ చేశాడు.

టైటిల్ జస్టిఫికేషన్…

టైటిల్ ‘సరిలేరు నీకెవ్వరు’ అనేది హీరోకి కాదు. ఇండియన్ సోల్జర్ కి సంబంధించింది. దేశరక్షణ కోసం తమ పిల్లలను ఎక్కడికో పంపుతున్న తల్లిదండ్రులకు వర్తిస్తుంది. సినిమాలో దీనికి జస్టిఫికేషన్ ఉంటుంది.

గర్వంగా ఫీలయ్యా…

అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్ టైన్ మెంట్ వదలకుండా మహేష్ బాబు లాంటి హీరో దొరికితే ఏం చేయగలడో ఈ సినిమాతో నిరూపించుకోబోతున్నాడు. సినిమా మొదట్లో నేను మహేష్ బాబును  ఎలాగైతే చూడాలనుకుంటున్నానో అలాంటి సినిమా అవుతుందనుకున్నా… కానీ సినిమా కంప్లీట్ అయ్యాక నేను గర్వపడేలా చేసే సినిమా అయింది.

అందుకే సెట్స్ వేయాల్సి వచ్చింది…

సినిమాలోని చాలా సీక్వెన్సెస్ ని సెట్ లో తీయాల్సి వచ్చింది. ‘కొండారెడ్డి బురుజు’ కూడా సెట్ వేయకుండా అక్కడే తీసి ఉంటే.. చాలా ఖర్చు తప్పేది.. కానీ ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్టు చేయలేం.. కాశ్మీర్ సీక్వెన్సెస్ కూడా అక్కడికి వెళ్ళి తీస్తే, కనీసం గట్టిగా అరవలేం… అందుకే ఖర్చయినా పరవాలేదని ఇక్కడే చేశాం…

తెలిసిన స్టోరీనే కానీ…

ఒక ఆర్మీ మేజర్ పబ్లిక్ లోకి వచ్చాడన్నది మీకు తెలిసిన కథ. కానీ వచ్చి ఏం చేశాడన్నది మాత్రం చాలా యూనిక్ గా ఉండబోతుంది.