'గూఢచారి' రైట్స్ దక్కించుకున్న అనిల్ సుంకర

Monday,July 23,2018 - 11:45 by Z_CLU

ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర, గూఢచారి సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్నారు.. ఆయన నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పతాకం అసోసియేషన్ తో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

ఇటీవలే విడుదలైన గూఢచారి సినిమా టీజర్ 4 మిలియన్ వ్యూస్ తో అందరి దృష్టిని ఆకర్షించగా సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. యాక్షన్ స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా లో అడవి శేష్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించింది కూడా ఇతడే.

మొత్తం 116 రోజులలో 158 డిఫరెంట్ లొకేషన్స్ లో హై టెక్నికల్ వాల్యూస్ తో సినిమాను రూపొందించారు.. శశి కిరణ్ తిక్కా డైరక్ట్ చేసిన ఈ సినిమాలో, 2013 మిస్ ఇండియా శోభిత ధూళిపాళ్ల టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది. ఒకప్పటి హీరోయిన్ సుప్రియ యార్లగడ్డ 20 సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. మరో కీలక పాత్రలో మధుషాలిని కనిపించనుంది.

అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు విస్టా డ్రీమ్ మర్చంట్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 3 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది..