F3 Movie - చాలా ఒత్తిడి ఫీల్ అయ్యాను

Sunday,May 22,2022 - 11:40 by Z_CLU

ఎఫ్3 ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. “ఎఫ్ 3 లాంగ్ జర్నీ, ప్యాండమిక్ ని దాటి వచ్చాం. మీకు వినోదాన్ని పంచాలని, ఎఫ్ 2కి మించి నవ్వించాలని చాలా కష్టపడి పని చేశాం. నా స్క్రిప్ట్ టీం కు చాలా థ్యాంక్స్. నవ్వడం ఈజీ కానీ కామెడీ క్రియేట్ చేయడం అంత తేలిక కాదు. నిర్మాత దిల్ రాజు గారు నాకు ప్రొడ్యుసర్ కంటే ఫ్యామిలీ అని చెప్పాలి. మా కాంబినేషన్ లో సినిమాలు వస్తూనే వుంటాయి, నిర్మాత శిరీష్ గారు నాకు గొప్ప ఎనర్జీ ఇస్తుంటారు. తమన్నా, మెహరీన్, సోనాల్, అలీ, రాజేంద్ర ప్రసాద్ , ఇలా సినిమాలో నటించిన నటీనటులు లందరికీ కృతజ్ఞతలు. అందరూ చక్కగా చేశారు. స్పెషల్ సాంగ్ చేసిన పూజా హెగ్డేకి కూడా కృతజ్ఞతలు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. వరుణ్ తేజ్ నా బ్రదర్ లాంటి వారు. ఈ సినిమాలో కొత్త వరుణ్ ని చూస్తారు. ఆయన టైమింగ్ అదిరిపోతుంది. వెంకటేష్ గారు నా ఆల్ టైం ఫేవరేట్ హీరో. కామెడీ టైమింగ్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటేష్ గారు గ్రేట్ ఇమేజ్ వున్న హీరో, కానీ కామెడీ చేసేటప్పుడు ఇమేజ్ ని పక్కన పెట్టి చేస్తారు. ఇలా చేయాలంటే లోపల చాలా పాజిటివ్ వుండాలి. ఎఫ్ 2కంటే ఎఫ్ 3 లో ఆయన మరింత హిలేరియస్ గా చేశారు. ఈ రెండేళ్ళ లో చాలా ఒత్తిళ్ళు అనుభవించాం, మే 27కి ఏమీ అలోచించకుండా ఎఫ్ 3ఆడుతున్న థియేటర్ లోకి వెళ్లి సరదాగా నవ్వుకోండి… నవ్వుకోండి.. నవ్వుకోండి..”