అనీల్ రావిపూడి సెంటిమెంట్ ఇదే

Thursday,April 16,2020 - 12:01 by Z_CLU

ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. దర్శకుడు అనీల్ రావిపూడికి కూడా అలాంటి సెంటిమెంట్ ఒకటి ఉంది. ఏ కథ రాసుకున్నా ఈయన అరకు వెళ్తాడు. అక్కడే కథ రాసుకుంటాడు. అయితే పూర్తి కథ అక్కడ రాయడు. ఫస్టాఫ్ మాత్రమే అక్కడ పూర్తిచేస్తాడు.

సెకెండాఫ్ కు లొకేషన్ షిఫ్ట్ అవుతాడు అనీల్. ఈసారి ప్రకాశం జిల్లాలోని తన సొంతూరుకు వెళ్లిపోతాడు. తన ఇంట్లోనే సెకెండాఫ్ పూర్తిచేయడం ఈ డైరక్టర్ సెంటిమెంట్. ఇలా తన సెంటిమెంట్ ను తాజాగా బయటపెట్టాడు అనీల్ రావిపూడి.

ప్రస్తుతం ఈ దర్శకుడు ఎఫ్3 పనిమీద బిజీగా ఉన్నాడు. ఎప్పట్లానే సినిమా ఫస్టాఫ్ ను విశాఖలో పూర్తిచేశాడు. ఇప్పుడు సెకెండాఫ్ కోసం తన సొంతూరు వెళ్లాడు. లాక్ డౌన్ కంటే ముందే తన రైటింగ్ టీమ్ తో సొంతూరు చేరుకున్నాడు అనీల్.

ఎఫ్3లో లీడ్ పెయిర్స్ అలానే ఉంటాయని, కథ మాత్రం సీక్వెల్ లా కాకుండా కొత్త స్టోరీలైన్ సెలక్ట్ చేసుకున్నామంటున్నాడు అనీల్ రావిపూడి. వెంకీ ఆసనం, హనీ ఈజ్ ది బెస్ట్ లాంటి మేనరిజమ్స్ మాత్రం అలానే ఉంటాయన్నాడు.