#NBK108 అనీల్ రావిపూడి చెప్పిన విశేషాలు

Sunday,February 20,2022 - 04:11 by Z_CLU

Anil Ravipudi reveals details about movie with Balakrishna

నందమూరి బాలకృష్ణ -అనీల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు డైరెక్టర్ అనీల్ రావిపూడి. గతంలో బాలకృష్ణ గారితో చేయాలనుకున్న ‘రామారావ్’ కథకి ఇప్పుడు చేయబోతున్న కథకి సంబంధం లేదని తెలిపాడు. కాకపోతే ఆ టైంలో బాలకృష్ణ గారిని ఊహించుకొని రాసిన డైలాగ్స్ మాత్రం వాడే అవకాశం ఉందని చెప్పుకున్నాడు. మేమిద్దరం కలిసి ఓ మార్క్ లో సెన్సేషనల్ సినిమా చేయాలని భావిస్తున్నామని జూన్ నుండి షూటింగ్ మొదలు కానుందని తెలిపాడు.

ఇక ఎప్పటి నుండో చర్చల్లో ఉన్న లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా త్వరలోనే చేస్తానని చెప్పాడు అనీల్ రావిపూడి. ఒక టైంలో సాయి పల్లవితో ఆ సినిమా చేయాలనుకున్నానని , తనకి కథ బాగా నచ్చిందని , కానీ ఆ టైంలో ఇద్దరం ఫుల్ బిజీగా సినిమాలు చేస్తున్నాని అందుకే కుదర్లేదని తెలిపాడు. మళ్ళీ ఆ సినిమా చేస్తే అప్పుడు ఏ హీరోయిన్ ఎగ్జైట్ అయితే ఆమెతో చేస్తానంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఇదే ఇంటర్వ్యూలో F3 గురించి కూడా చెప్పాడు అనీల్ రావిపూడి. సినిమా చాలా బాగా వస్తుందని, F2 నచ్చని వారెవరైనా ఉంటే వాళ్లకి కూడా ఈ సీక్వెల్ కచ్చితంగా నచ్చుతుందని సినిమా చాలా బాగా వస్తుందని అన్నాడు. ఇక బాలీవుడ్ లో గోల్ మాల్ ఫ్రాంచైజీ లాగే తెలుగులో మనకి F2 ఉండబోతుందని మధ్యలో ఒక్కో సినిమా చేస్తూ మళ్ళీ సీక్వెల్ చేస్తుంటానని చెప్పుకున్నాడు అనీల్ రావిపూడి.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics