"సరిలేరు.." క్లైమాక్స్ కు మిక్స్ డ్ రెస్పాన్స్

Thursday,January 16,2020 - 12:38 by Z_CLU

సినిమా ఓపెనింగ్ రోజునే ఈ టాక్ చిన్నగా బయటకొచ్చింది. ఎందుకంటే పెద్ద హీరోకు భారీ ఫైట్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో అలా జరగలేదు. దీంతో ఫ్యాన్స్ కొంత డిసప్పాయింట్ అయ్యారు. దీంతో దర్శకుడు అనీల్ రావిపూడి కూడా ఏకీభవించాడు. సరిలేరు నీకెవ్వరు క్లైమాక్స్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చిన మాట నిజమే అంటున్నాడు. కానీ ఆ సినిమాకు అది కరెక్ట్ అంటున్నాడు రావిపూడి.

“సినిమాను అలా ముగించడంతో మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చిన మాట నిజమే. కొంతమంది ఇండస్ట్రీ జనాలు కూడా ఈ విషయం నాతో చెప్పారు. కానీ కామన్ ఆడియన్స్ లో మాత్రం ఈ కంప్లయింట్ లేదు. వాళ్లు ఈ క్లైమాక్స్ ను ఇష్టపడ్డారు. ఈ క్లైమాక్స్ రాసుకున్నప్పుడే దీనికి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తుందని ఊహించాను. కానీ ఈ కథకు ఈ క్లైమాక్స్ అయితేనే కరెక్ట్.”

తను రాసుకున్న క్లయిమాక్స్ ను మహేష్ కూడా ఓకే చేశాడంటున్నాడు అనీల్ రావిపూడి. మహేష్ ఓకే చేయకుండా అలాంటి క్లయిమాక్స్ రాయలేమని, కానీ ఆ కథకు అదే కరెక్ట్ క్లైమాక్స్ అంటున్నాడు అనీల్.