Anil Ravipudi - ఈసారి దర్శకత్వ పర్యవేక్షణ

Tuesday,January 26,2021 - 12:42 by Z_CLU

సూపర్ హిట్ డైరక్టర్ అనీల్ రావిపూడి. కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు ఇస్తున్న డైరక్టర్. ఇలాంటి డైరక్టర్ “దర్శకత్వ పర్యవేక్షణ” చేస్తే ఎలా ఉంటుంది. అలాంటి గోల్డెన్ ఛాన్స్ అందుకున్న సినిమా గాలి సంపత్. అవును.. ఈ సినిమాకు అనీల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు.

చిన్న చిత్రాల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న మూవీ ‘గాలి సంపత్’. ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రజెంట్ చేస్తున్నాడు. స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నాడు. ఇప్పుడీ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నట్టు ప్రకటించాడు అనీల్ రావిపూడి.

Anil-Ravipudi-Direction-Supervision-Gaali-Sampath-1

అనిల్ కో-డైరెక్ట‌ర్, రైట‌ర్, మిత్రుడు ఎస్.క్రిష్ణ నిర్మాత‌గా మారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అందుకే తన ఫ్రెండ్ కోసం అనీల్ ఇలా దర్శకత్వ పర్యవేక్షకుడిగా మారాడు. అనీష్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను స్థాపించిన కృష్ణ… షైన్ స్క్రీన్స్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో గాలి సంపత్ అనే టైటిల్ రోల్ ను రాజేంద్ర ‌ప్ర‌సాద్ పోషిస్తున్నారు.