సరిలేరు 'అనిల్' కెవ్వరు

Sunday,January 05,2020 - 11:40 by Z_CLU

ఒక వైపు సూపర్ స్టార్… మరో వైపు భారీ తారాగణం.. భారీ బడ్జెట్ సినిమా.. లాకయిన రిలీజ్ డేట్   వీటన్నిటిని హ్యాండిల్ చేసి సినిమా పూర్తి చేయడానికి ఏ డైరెక్టర్ కయినా దాదాపు ఏడాది కావాల్సిందే. అయితే అనిల్ రావిపూడి మాత్రం ఈ విషయంలో సరిలేరు తనకెవ్వరు అనిపించుకున్నాడు. అవును మహేష్ తో సినిమా అంటేనే ఏడాది టైం తీసుకునే ఈ రోజుల్లో జస్ట్ ఐదు నెలల్లోనే సినిమా తీసి సెన్సార్ కాపీ ఇచ్చేసాడు అనిల్.

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సరిగ్గా ఈ ఏడాది మే 31 న పూజా కార్యక్రమాలు జరుపుకుంది. నెల తర్వాత అంటే జులై 5 న షూటింగ్ మొదలైంది. అక్కడి నుండి ఏక దాటిగా ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా చకచకా షూటింగ్ చేసేసాడు అనిల్. రిలీజ్ కి ఇంకా నెల రోజులు ఉందనగా డిసెంబర్ 18న టోటల్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసాడు. సరిగ్గా పదిరోజుల ముందు ఫస్ట్ కాపీ వచ్చేసేలా ప్లాన్ చేసుకున్నాడు.

ఇలా తనదైన ప్లానింగ్ తో జస్ట్ ఐదు నెలల్లోపే మహేష్ లాంటి స్టార్ హీరోతో భారీ తారాగణంతో సినిమా కంప్లీట్ చేసి సరిలేరు ‘అనిల్’ కెవ్వరు అనిపించుకున్నాడు. ఇక ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొడితే అనిల్ టాప్ లీగ్ లోకి వెళ్ళడం ఖాయం.