అనిల్ రావిపూడి చేతులమీదుగా "నాటకం' ఫస్ట్ లుక్

Saturday,September 01,2018 - 10:26 by Z_CLU

దర్శకుడు అనిల్ రావిపూడి ‘నాటకం’ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.. ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి గోగన దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండడంతో చిత్ర నిర్మాతలు ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సాయి కార్తిక్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తుండగా, గరుడవేగా ఫేమ్ అంజి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.. రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాని శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ మరియు ఉమా కూచిపూడి నిర్మిస్తున్నారు..

నటీనటులు: ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు : కళ్యాణ్ జి గోగన
సమర్పిస్తున్న వారు : రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు:  శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ మరియు ఉమా కూచిపూడి
సంగీతం: సాయి కార్తీక్
డీఓపీ : గరుడ వేగ అంజి
ఎడిటర్: మణికాంత్