అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ

Tuesday,October 17,2017 - 07:07 by Z_CLU

రవితేజ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ సినిమా రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకి సంబంధించి ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. ఆ చిట్ చాట్ మీకోసం…

 రవితేజ గారు ఒప్పుకోవడానికి రీజన్ అదే…

కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు నేనెలాంటి కథ చెప్పబోతున్నాననే ఐడియా అసలు ఆయనకు కూడా లేదు. కానీ సెకండాఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ చెప్పేటప్పుడు చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యారు. బ్లైండ్ కాన్సెప్ట్ తో చాలా మంచి మంచి ఫీల్ గుడ్ సినిమాలు వచ్చాయి కానీ ఇలాంటి కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ఇప్పటి వరకు రాలేదు…

ఈ కథ రామ్ కి చెప్పాను కానీ…

రామ్ కి కథ చెప్పిన మాట వాస్తవమే… రామ్ కే కాదు ఆయన తరవాత తారక్ కి కూడా కథ చెప్పాను, కానీ అదే కథ రవితేజ గారి దగ్గరికి వచ్చేసరికి చాలా మారిపోయింది. నిజానికి చెప్పాలంటే రామ్ కి చెప్పిన కథ వేరు, రవితేజ గారికి చెప్పిన కథ వేరు.

 

మెసేజ్ ఉంటుంది కాకపోతే…

ఒకటి రెండు చోట్ల ఇన్ డైరెక్ట్ గా మెసేజ్ ఉంటుంది కానీ అదే పనిగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు. బ్లైండ్ హీరో బేస్డ్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ రాజా ది గ్రేట్.

రిస్క్ అనిపించింది..

ఈ సినిమా పాయింట్ అనుకున్నప్పుడు రిస్క్ అనిపించింది కానీ దాన్ని ఎక్జిక్యూట్ చేసేటప్పుడు కానీ,  తీసేటప్పుడు అసలా భయం పోయింది. సినిమాలో ఎక్కడ కూడా లాజిక్ లెస్ అనిపించదు. బోర్ కొట్టదు…

వన్ ఆఫ్ ది హైలెటెడ్ క్యారెక్టర్

సినిమాలో రాధిక గారిది వన్ ఆఫ్ ది హైలెటెడ్ క్యారెక్టర్. తన కొడుకు డిజేబిలిటీ తెలిసి కూడా తనని పోలీస్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఒక సాధారణ విమెన్ కానిస్టేబుల్ తన కొడుకును ఒక టఫ్ పోలీస్ ఆపరేషన్ లో ఇన్వాల్వ్ అయ్యేలా చేయడం, మన హీరో ఆ టాస్క్ ని ఎలా కంప్లీట్ చేశాడు, ఎలా తానొక్కడే లీడ్ చేశాడు అనేది చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది.

తారక్ ఓకె అంటే అదృష్టమే…

తారక్ కి కథ చెప్పినప్పుడు పూర్తి కథ చెప్పలేదు. అందుకే ఆయన్ని కన్విన్స్ చేయలేకపోయాను. ఈ సినిమా తరవాత ఆయన ఓకె అంటే అదృష్టమే.

కథ హీరోయిన్ తో బిగిన్ అవుతుంది

రాజా ది గ్రేట్ సినిమా అసలు హీరోయిన్ కథతో బిగిన్ అవుతుంది. తానో ప్రాబ్లమ్ లో ఉండటం, కళ్ళు లేని మన హీరో తనను ఎలా కాపాడాడు..? ఓవరాల్ గా ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేశాడు అనేది ఇంటరెస్టింగ్ పాయింట్.

మహాధన్ చాలా బాగా చేశాడు..

రవితేజ గారి చైల్డ్ హుడ్ సీక్వెన్సెస్ లో ఆయన ఫీచర్స్ తో ఉంటె బావుండనిపించింది. మొదట్లో మహాధన్ గురించి అడిగినప్పుడు రవితేజ గారు ఒప్పుకోలేదు,  కానీ నేనే బతిమాలేసరికి ఒప్పుకున్నారు. మహాధన్ అద్భుతంగా నటించాడు. స్క్రీన్ పై చూస్తే బ్లైండ్ కుర్రాడిగా తన పర్ఫామెన్స్ చాలా న్యాచురల్ గా ఉంటుంది.

సినిమాలో రొమాన్స్ ఉండదు..

సినిమాలో పర్టికులర్ గా రొమాన్స్ ఉండదు. ఒక జెన్యూన్ ఫీల్ ఉంటుంది. హీరో క్యారెక్టర్ బ్లైండ్ కాబట్టి ఆ అడ్వంటేజ్ తీసుకోలేం, న్యాచురల్ గా ఉండే ఫీల్ ఉంటుంది.

చాలా ప్రెజర్ గా ఫీల్ అయ్యా…

ఈ సినిమా చేసేటప్పుడు స్టార్ హీరోతో చేస్తున్నానన్న ఫీలింగ్ కన్నా, కాన్సెప్ట్ కొత్తది కాబట్టి ఇంటర్నల్ గా చాలా ప్రెజర్ గా ఫీల్ అయ్యా… ప్రతీది చాల అబ్జర్వ్ చేయాలి, ప్రతి షాట్ లో రవితేజ గారిని బ్లైండ్ లా ప్రెజెంట్ చేయాలి, చిన్న తేడా వచ్చినా తెలిసిపోతుంది… కానీ రవితేజ ఇన్వాల్వ్ మెంట్, న్యాచురల్ పర్ఫామెన్స్ తో అసలు ఒక్కచోట కూడా నాకు చిన్న సజెషన్ చేసే చాన్స్ కూడా ఇవ్వలేదు.

రీసర్చ్ చేస్తేనే తెలిసింది…

ఈ కాన్సెప్ట్ అనుకోగానే నేను బ్లైండ్ పీపుల్ తో రీసర్చ్ చేశాను, టైమ్ స్పెండ్ చేశాను, ఈ ప్రాసెస్ లో నాకర్థం అయింది ఏంటంటే, వాళ్ళు మనకన్నా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు… అసలు వాళ్ళ కాన్ఫిడెన్స్ నన్ను చాలా మెస్మరైజ్ చేసేసింది. రవితేజ గారి క్యారెక్టర్ ని మ్యాగ్జిమం అలాగే న్యాచురల్ వే లో డెవెలప్ చేశాను.

వాళ్ళంటే నాకు చాలా గౌరవం

పటాస్ లో డెఫ్ అండ్ డంబ్, సుప్రీమ్ క్లైమాక్స్ లో ఫిజికల్లీ చాలెంజ్డ్, ఈ సినిమాలో బ్లైండ్.. నేనైతే పర్టికులర్ గా  కావాలని ప్లాన్ చేసుకోవట్లేదు కానీ, నాకు వాళ్ళపై ఉన్న స్పెషల్ రెస్పెక్ట్ వల్ల, నేను అలాంటి కథలు డెవెలప్ చేసుకుంటున్నానేమో…

మెహరీన్ రేంజ్ మారిపోతుంది

మెహరీన్ కి ఇది మూడో సినిమా, రాజా ది గ్రేట్ లో తనది చాలా ఇమార్తెంట్ క్యారెక్టర్. ఈ సినిమా తరవాత, డెఫ్ఫినేట్ గా తన రేంజ్ మారిపోతుంది.