Anil Ravipudi - సరిలేరు నీకెవ్వరు

Monday,November 23,2020 - 01:07 by Z_CLU

తక్కువ టైంలోనే అతి తక్కువ సినిమాలతో బ్రాండ్ క్రియేట్ చేసుకొని దూసుకెళ్తున్న దర్శకుల లిస్టు చూస్తే అందులో ముందుంటాడు Anil Ravipudi. దర్శకుడిగా అనిల్ చేసింది కేవలం ఐదు సినిమాలు. కానీ ఆ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేసి తన కథలతో కాసుల వర్షం కురిపించాడు ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అనిల్ రావిపూడి పై ZeeCinemalu బర్త్ డే స్పెషల్.

Anil Ravipudi Birthday Special 1

వరుస అపజయాలతో సతమతమవుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ ను తన డెబ్యూ సినిమా ‘పటాస్’ తో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చాడు అనిల్. ఆ సినిమాతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకొని దిల్ రాజు బ్యానర్ లో వరుస ఆఫర్లు అందుకున్నాడు.

‘పటాస్’ తర్వాత అనిల్ నుండి వచ్చిన రెండో సినిమా ‘సుప్రీమ్’ కూడా సూపర్ హిట్ సాధించడంతో మూడో సినిమాకే రవితేజ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు.

Anil Ravipudi Birthday Special 4

‘రాజా ది గ్రేట్’ తో హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకున్న అనిల్ రావిపూడిని ‘F2’ సినిమా స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేర్చేసింది. వెంకీ , వరుణ్ తేజ్ తో అనిల్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు రాబట్టి 100 కోట్ల క్లబ్ లో చేరి సంక్రాంతి డబుల్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.

Anil Ravipudi Birthday Special 3

ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడంటే అనిల్ డైరెక్షన్ ఏ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చెప్పుకోవచ్చు.

anil ravipudi mahesh

మహేష్ బాబుతో అనిల్ తీసిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచి టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. నిజానికి ఐదు సినిమాల అనిల్ గ్రాఫ్ చూస్తే తక్కువ టైంలో వరుస సక్సెస్ లు సాధించిన స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిన అరుదైన రికార్డు అతనికే సొంతం అనిపిస్తుంది.

తన కామెడీ టైమింగ్ ని స్క్రిప్ట్ లో చేర్చి సన్నివేశాలు రాసుకొని ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం అనిల్ స్పెషాలిటీ. అదే తన సక్సెస్ కి కారణమనుకోవచ్చు. త్వరలోనే F3 తో మళ్ళీ ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అయిన ఈ నవ్వుల దర్శకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది జీ సినిమాలు. Happy Birthday ANIL RAVIPUDI.