అనిల్ రావిపూడి ప్లాన్ ‘B’ అమలు చేస్తాడా..?

Wednesday,March 13,2019 - 11:02 by Z_CLU

మహేష్ బాబు సినిమాలో కీ రోల్ కోసం ఉపేంద్రను సంప్రదించాడు అనిల్ రావిపూడి. క్యారెక్టర్, కథలాంటివి ఇంకా వినలేదు కానీ, ఫస్ట్ అటెంప్ట్ లోనే కుదిరేలా లేదమ్మా.. కొంచెం బిజీ అన్నాడట. అప్పుడు స్వయంగా ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయి, ఒకసారి క్యారెక్టర్ వినండి అని కన్విన్స్ చేశారు. ఉపేంద్ర ఇంకా టైమ్ ఫిక్స్ చేయలేదు కానీ, రేపో మాపో వినే ఆలోచనలో ఉన్నాడు. యస్ అంటే సమస్యే లేదు. అనిల్ రావిపూడి సినిమాలో ఫిక్స్ చేసుకోవాల్సిన ఇంకో క్యారెక్టర్ వైపు ఫోకస్ పెట్టుకుంటాడు. కానీ నో అంటే..?…

రీసెంట్ గా ఈ సినిమాలో విజయశాంతి నటిస్తుందనే న్యూస్ బయటికి వచ్చింది. ఆ తరవాత ఇప్పుడేమో ఉపేంద్ర లాంటి స్టార్ ని సంప్రదించారు మేకర్స్, దీన్ని బట్టి అనిల్ రావిపూడి సినిమాని గ్రాండ్ స్కేల్ పై ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాకి విజయ శాంతి ఆల్మోస్ట్ ఓకె అనేసిందని తెలుస్తుంది. కాకపోతే ఉపేంద్ర సంగతే ఇంకా తేలాల్సి ఉంది.

మహేష్ బాబు రేంజ్ స్టార్ సినిమాకి నో చెప్పడం కొంచెం కష్టమే అయినా, ఆల్రెడీ ఉన్న కమిట్ మెంట్స్ ని మ్యానేజ్ చేయలేక వదులుకున్నా, ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఆ పరిస్థితుల్లో అనిల్ రావిపూడి ఏం చేయబోతున్నాడు..?  అనిల్ రావిపూడి మైండ్ లో ఫిక్సయిన  ప్లాన్ ‘బి’ ఏంటి..?… ఆడియెన్స్ లో ఏ స్థాయిలో క్యూరియాసిటీ ఉన్నా, అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే కానీ, ఏమీ చెప్పలేం.

మామూలుగా మహేష్ బాబు అంటేనే హెవీ స్టాండర్డ్స్, దానికి తోడు ఉపేంద్ర లాంటి స్టార్ కీ రోల్ అంటే, అనిల్ రావిపూడి ఇప్పటి దాకా ఓ రేంజ్, ఇప్పటి నుండి నెక్స్ట్ లెవెల్ అనిపించేలా సినిమా ప్లాన్ చేస్తున్నాడనిపిస్తుంది. ఏది ఏమైనా ‘మహర్షి’ తరవాత ఇమ్మీడియట్ సినిమా తనతోనే అని కన్ఫమ్ అయినప్పటి నుండి, అనిల్ రావిపూడి పెంచిన స్పీడ్ కి తగ్గట్టు ఈ సినిమా గురించి బయటికి వస్తున్న అప్డేట్స్, సినిమా సెట్స్ పైకి కూడా రాకముందే అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.