ఆ రికార్డు అనిల్ కే దక్కింది

Sunday,January 13,2019 - 10:06 by Z_CLU

దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్టార్ట్ చేసి పదిహేణేళ్లవుతోంది.. టాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్స్ లో కొందరు ఈ బ్యానర్ నుండి పరిచయమయిన వాళ్ళే. అయితే ఎవరికీ దక్కని ఓ అరుదైన రికార్డు మాత్రం అనీల్ కే దక్కింది. ఈ సంస్థలో ఒక్కొక్కరూ రెండు మూడు సినిమాలు చేసినా ఈ బ్యానర్ లో హట్రిక్ హిట్ కొట్టింది అనిల్ రావిపూడి మాత్రమే.

దిల్ రాజు బ్యానర్ లో అనిల్ డైరెక్ట్ చేసిన ‘సుప్రీం’ , ‘రాజా ది గ్రేట్’ రెండు సూపర్ హిట్లే.. ఇప్పుడు ఈ లిస్టు ‘F2’ కూడా చేరిపోయింది. F2 తో ఎస్.వి.సి సంస్థలో హాట్రిక్ హిట్ కొట్టి దర్శకుడిగా శెభాష్ అనిపించుకున్నాడు అనిల్.

‘పటాస్’ తర్వాత దిల్ రాజుతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వచ్చిన అనిల్ నెక్స్ట్ సినిమాను కూడా ఈ బ్యానర్ లోనే చేస్తాడనే టాక్ వినిపిస్తుంది. మరి అనిల్ నెక్స్ట్ సినిమా కూడా దిల్ రాజుతోనే  ఉంటుందా…లేదా చూడాలి.