'అంధగాడు' ట్రైలర్ హంగామా

Saturday,May 20,2017 - 05:08 by Z_CLU

లేటెస్ట్ గా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాతో సందడి చేసి సూపర్ హిట్ అందుకున్న రాజ్ తరుణ్ ‘అంధ గాడు’ సినిమాతో త్వరలోనే థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఏ.కె. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రచయిత వెలిగొండ శ్రీనినివాస్ దర్శకత్వం లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రెజెంట్ ప్రీప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది..

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశాడు నిఖిల్. రాజ్ తరుణ్ కామెడీ టైమింగ్ తో ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ప్రెజెంట్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ హంగామా చేస్తుంది. ఇప్పటికే టీజర్ తో సినిమా పై అంచనాలను పెంచేసిన ఈ సినిమా ప్రెజెంట్ ట్రైలర్ తో సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. మరి ఈ సినిమాతో రాజ్ తరుణ్ ఏ రేంజ్ హిట్ సాదిస్తాడో.. చూడాలి.