మే 26న 'అంధగాడు' రిలీజ్

Tuesday,April 25,2017 - 08:02 by Z_CLU

రాజ్ తరుణ్- హెబ్బా పటేల్ హీరో హీరోయిన్స్ గా వెలిగొండ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఏ కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా ‘అంధగాడు’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ను ఈరోజు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు యూనిట్..

ఒక అంధుడి జీవితంలో జరిగిన అనుకోని సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది.

రాజ్ తరుణ్ అంధుడి గా నటిస్తుండడం, ‘కుమారి 21ఎఫ్’,’ఈడో రకం ఆడో రకం’ వంటి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న రాజ్ తరుణ్-హెబ్బా కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడం, టీజర్ అందరిని ఎట్రాక్ట్ చేయడంతో ఈ సినిమా పై అంచనాలు నెలకొన్నాయి.. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 26 నుంచి థియేటర్స్ లో హంగామా చేయడానికి రెడీ అవుతుంది..