జూన్ 1 న అంధగాడు ప్రీమియర్ షో

Monday,May 29,2017 - 04:17 by Z_CLU

రాజ్ తరుణ్ హెబ్బా పటేల్ జంటగా నటించిన అంధగాడు జూన్ 2 న రిలీజ్ అవుతుంది. ఈ లోపు ఈ సినిమా ప్రీమియర్ షో ని జూన్ 1 న ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్. హైదరాబాద్, ఏలూరు, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు మరియు తిరుపతి నగరాల్లో ప్రీమియర్ షోస్ నిర్వహించే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.

ఈ సినిమాలో దాదాపు 30 నిమిషాలు అంధుడిలా కనిపించనున్నాడు రాజ్ తరుణ్. రొమాన్స్, థ్రిల్, యాక్షన్ ఇలా మ్యాగ్జిమం అన్ని ఎలిమెంట్స్ తో ఎంటర్ టైన్ చేయనున్న ‘అంధగాడు’ ప్రిమియర్ షోస్, పాజిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేయడంలో సక్సీడ్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.

హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా వెలిగొండ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కింది.