ఇటలీలో అంధగాడు

Monday,April 03,2017 - 02:16 by Z_CLU

డిఫెరెంట్ సినిమాలతో ఎంటర్ టైన్ చేస్తున్న రాజ్ తరుణ్ ‘అంధగాడు’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఇటలీలోని కలర్ ఫుల్ లొకేషన్స్ లో పాటల్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉంది సినిమా యూనిట్. ఈ పాటలకు రాజు సుందరం మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే టాకీపార్ట్ ని కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్ ఇంటరెస్టింగ్ లోకేషన్స్ లో ఈ సాంగ్స్ ని ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో వెలిగొండ శ్రీనివాస్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. రాజేంద్ర ప్రసాద్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా డిఫెరెంట్ పాయింట్ తో తెరకెక్కుతుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

అజయ్ సుంకర, రామబ్రహ్మం సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాతో టాలీవుడ్ మోస్ట్ ట్రెండింగ్ జోడీ రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ మరోసారి ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయనున్నారు. బ్యాలన్స్ ఉన్న సాంగ్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేసుకుని మే 26 న సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.