అనసూయ కోసం మరో కీలక పాత్ర రెడీ?

Tuesday,February 25,2020 - 11:40 by Z_CLU

స్మాల్ స్క్రీన్ పై స్టార్ గా కొనసాగుతున్న అనసూయ.. అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కూడా తన ప్రతాపం చూపిస్తుంది. మంచి పాత్రలు దొరికితే నటిస్తుంది. ఇప్పటికే రంగస్థలంలో అనసూయ చేసిన రంగమ్మత్త పాత్ర ఆమెకు లైఫ్ టైమ్ గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు అలాంటిదే మరో పాత్ర ఆమెకు దగ్గరగా వచ్చి ఆగింది.

హిందీలో సూపర్ హిట్టయిన అంథాదున్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు నితిన్. నిన్న ప్రారంభమైంది ఈ సినిమా. ఇందులో ఓ కీలక పాత్ర కోసం అనసూయను అనుకుంటున్నారు. ఇది అలాంటిలాంటి క్యారెక్టర్ కాదు. అంథాదున్ హిందీ సినిమా చూసిన వాళ్లకు ఈ విషయం అర్థమౌతుంది.

సినిమాలో ఆయుష్మాన్ ఖురానా పోషించిన అంధుడి పాత్రను నితిన్ పోషించబోతున్నాడు. ఇదే సినిమాలో టబు కూడా ఉంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకమైంది. ఇంకా చెప్పాలంటే మూవీలో ఆమెనే విలన్. అలాంటి పాత్ర ఇప్పుడు అనసూయను వరించబోతోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.