Vedantham Ragavaiah - హాట్ యాంకర్ ఎంట్రీ?

Tuesday,January 12,2021 - 03:22 by Z_CLU

సునీల్ హీరోగా VedanthamRagavaiah అనే సినిమా తెరకెక్కనున్న సినిమా సంగతి తెలిసిందే. ఇటివలే లాంచ్ అయిన ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుంది. అయితే ఈ సినిమాలో సునీల్ సరసన హీరోయిన్ గా Anasuya నటించనుందని తెలుస్తుంది. కామెడీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సునీల్ కి అనసూయ భార్యగా కనిపించనుందని టాక్.

anasuya

ప్రస్తుతం మేకర్స్ నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు కానీ అనసూయ సినిమాలో నటించడం పక్కా అని తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ ప్రకటించే అవకాశం ఉంది. డైరెక్టర్ హరీష్ శంకర్ కథ అందిస్తూ సమర్పిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట . గోపి ఆచంట నిర్మిస్తున్నారు. చంద్ర మోహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.