చరణ్-సుకుమార్ సినిమాలో ఆ భామ ?

Monday,April 10,2017 - 03:00 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ &స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై విల్లేజ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మూవీ ప్రెజెంట్ రాజమండ్రి పరిసర ప్రాంతంలో శరవేగంగా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రెజెంట్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది..

 

చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ ఓ కీ రోల్ చేయబోతోందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఈ సినిమాలో అనసూయ ని సుకుమార్  ఓ విల్లేజ్ గర్ల్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడట.. మరి ఇప్పటికే ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘విన్నర్’ సినిమాల్లో గెస్ట్ క్యారెక్టర్, సాంగ్స్ తో ఎంటర్టైన్ చేసిన అనసూయ ఈ సినిమాలో ఎలా ఎంటర్టైన్ చేస్తుందో? చూడాలి..