Pawan Kalyan సినిమాలో హాట్ యాంకర్?

Wednesday,January 20,2021 - 12:35 by Z_CLU

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న అనసూయ మరో క్రేజీ సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. పవర్ స్టార్ Pawan Kalyan-Krish కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పిరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమాలో అనసూయ ఓ రోల్ తో పాటు స్పెషల్ సాంగ్ లో మెరవనుందని టాక్.

తాజాగా అనసూయని కలిసి క్రిష్ ఆమె రోల్ తో పాటు సాంగ్ కూడా ఆఫర్ చేసాడని, పవన్ సినిమాలో అవకాశం రావడంతో హాట్ యాంకర్ వెంటనే ఓకె చేసిందని అంటున్నారు.

ప్రస్తుతం అనసూయ సునీల్ ‘వేదాంతం రాఘవయ్య’, రవితేజ ‘ఖిలాడి’ సినిమాలతో పాటు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న తమిళ్ సినిమాలో ఓ రోల్ చేస్తుంది. మరి వీటితో పాటు అనసూయ పవన్ సినిమాలో కూడా కనిపించే ఛాన్స్ ఉంది.

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన పవన్ -క్రిష్ సినిమా అతి త్వరలోనే మరో షెడ్యుల్ జరుపుకోనుంది. వచ్చే ఏడాది సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలని చూస్తున్నాడు క్రిష్.