మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో అనసూయ

Sunday,July 01,2018 - 01:39 by Z_CLU

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్ గా వస్తున్న చిత్రం యాత్ర. మమ్ముట్టి రాజశేఖర్‌ రెడ్డిగా నటిస్తున్న ఈ సినిమాకు మహి వి రాఘవ్‌ దర్శకుడు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్ చల్లా, శశి దేవ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పుడీ సినిమాలోకి అనసూయను కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది.

కర్నూలు జిల్లా నాయకురాలిగా ఉండే ఆ పాత్రకు అనసూయ అయితే సరిగ్గా సరిపోతుందని యూనిట్ భావిస్తోందట. అనసూయ కూడా ఈ పాత్ర పోషించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ చిత్రంలో ప్రముఖ నటి సుహాసిని సబితా ఇంద్రారెడ్డి పాత్రలో నటిస్తుండగా, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, భూమిక మరికొన్ని కీలకపాత్రల్లో కనిపించనున్నారు. గ్యాప్స్ లేకుండా షూటింగ్ పూర్తిచేసి, సంక్రాంతికి సినిమాను తీసుకురావాలని అనుకుంటున్నారు.