అందులో నిజం లేదంటున్న అనసూయ

Wednesday,June 21,2017 - 04:30 by Z_CLU

సెలబ్రిటీస్ మీద గాసిప్స్ రావడం వెరీ కామన్. ఈసారి అలాంటి గాసిప్స్ కు అనసూయ బలైంది. యాంకర్ నుంచి నటిగా మారిన ఈ ముద్దుగుమ్మపై ఊహించని రీతిలో పుకారు ఒకటి పుట్టుకొచ్చింది. త్వరలోనే ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోబోతోందనేది ఆ వార్త.

తన అందాల్ని మరింత మెరుగుపరుచుకునేందుకు అనసూయ ప్లాస్టిక్ సర్జరీ వైపు మొగ్గుచూపుతోందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమంటోంది. మొదట ఈ విషయాన్ని లైట్ తీసుకుంది అనసూయ. కానీ, ఆ పుకారు రోజురోజుకు ఎక్కువవడంతో పాటు.. ప్రేక్షకులు దాన్నే నిజమని భావించే స్టేజ్ కు వెళ్లిపోయారు. దీంతో ఆ పుకారుపై క్లారిటీ ఇవ్వక తప్పలేదు అనసూయకు.

ఇలాంటి వార్తల్ని అస్సలు నమ్మొద్దని ట్వీట్ చేసింది అనసూయ. తనను సంప్రదించకుండా ఇలాంటి వార్తలు రాసేస్తున్నారని, వాళ్ల సొంతానికి ఏవేవో క్రియేట్ చేసి వార్తలు రాసేస్తున్నారని చెప్పుకొచ్చింది అనసూయ. తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం లేదని, ఇలాంటి షార్ట్ కట్స్ పై తనకు నమ్మకం లేదని క్లియర్ గా ట్వీట్ చేసింది అనసూయ. ఈమె ట్వీట్ తో ఈ పుకారుకు చెక్ పడింది.