యథార్థ పాత్రల ప్రేరణతో ఆనందభైరవి

Saturday,February 01,2020 - 12:39 by Z_CLU

M.V.V. సత్యనారాయణ (వైజాగ్ ఎంపీ) సమర్పణలో అంజలి, లక్ష్మీరాయ్, అధిత్ అరుణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం “ఆనంద భైరవి”. నంది అవార్డ్ గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని “నిధి మూవీస్, హరివెన్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై బి తిరుపతి రెడ్డి, రమేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వైజాగ్, హైదరాబాద్ లలో చేసిన షూటింగ్ తో 50% షూటింగ్ పూర్తయింది. తదుపరి హైదరాబాద్, చెన్నయ్ లలో ఏకదాటిగా జరిపే షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ పూర్తి చేసి…”సమ్మర్” లో చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

తదుపరి షెడ్యూల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. సమాజంలో ఉన్న ఎన్నో యదార్ధ పాత్రలు ఈ సినినిమాలో కనిపిస్తాయంటున్నారు మేకర్స్.

ఈ సినిమాలో ఆనందిని అనే పాత్రలో అంజలి, భైరవి అనే పాత్రలో లక్ష్మీరాయ్ కనిపిస్తారు. ఈ సినిమాలో లక్ష్మీరాయ్ యాక్షన్ స్టంట్స్ చేసింది. దీనికోసం ముంబయిలో ట్రయినింగ్ తీసుకుంది.

నటీనటులు – అంజలి, లక్ష్మీరాయ్, అదిత్ అరుణ్, సాయి కుమార్, రాశి, మురళీ శర్మ, సుమన్, బ్రహ్మాజీ, పృద్వి, డి.ఎస్.రావ్, గిరి, గుండు సుదర్శన్, ధన్ రాజ్, తదితరులు
కెమెరా:పి.జి.వింద
సంగీతం: మణిశర్మ
ఆర్ట్: నాని
ఎడిటర్: చోట. కె. ప్రసాద్
సమర్పణ: ఎం.వి వి సత్యనారాయణ (వైజాగ్ ఎంపీ)
నిర్మాతలు: బి.తిరుపతి రెడ్డి, రమేష్ రెడ్డి
కథ, కధనం, దర్శకత్వం: కర్రి బాలాజీ