టైటిల్ అనౌన్స్ చేసిన దేవరకొండ

Friday,July 10,2020 - 04:14 by Z_CLU

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ‘దొరసాని’ సినిమాతో హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ రెండో సినిమాతో రెడీ అవుతున్నాడు. వినోద్ అనే డెబ్యూ డైరెక్టర్ తో భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ నటిస్తున్న సినిమాకు సంబంధించి టైటిల్ అనౌన్స్ చేశారు.

చిన్న సందేశంతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి అతి త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆనంద్ సరసన వర్ష బొల్లమ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు స్వీకర్ అగస్త్య (కేరాఫ్ కంచరపాలెం ఫేమ్) సంగీతం అందిస్తున్నాడు.