Interview ఆనంద్ దేవరకొండ (పుష్పక విమానం)

Wednesday,November 10,2021 - 03:28 by Z_CLU

ఆనంద్ దేవరకొండ హీరోగా దామోదర దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిన ‘పుష్పక విమానం‘ నవంబర్ 12న గ్రాండ్ గా రిలీజవుతుంది. ఈ సందర్భంగా హీరో ఆనంద్ దేవర కొండ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు ఆనంద్ మాటల్లోనే…

సింగీతం గారు అలా అన్నారు 

ఈ సినిమాకు కొన్ని టైటిల్స్ అనుకున్నాం. అందులో పుష్పక విమానం ఫైనల్ చేశాం. మా డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి మీ టైటిల్ పెట్టుకుంటున్నామని చెప్పాడు. వెంటనే ఆయన అది నా టైటిల్ కాదండీ ఎవరైనా పెట్టుకోవచ్చు దానికేముంది అన్నారు. టైటిల్ పెట్టే ముందు ఆయనకి చెప్పి  బ్లెస్సింగ్స్ తీసుకున్నాం.

ప్రొడ్యూస్ చేద్దామనుకున్నా

మా డైరెక్టర్ దామోదర్  విజయ్ అన్నయ్య కి ఫ్రెండ్.  వాళ్ళది చాలా లాంగ్ ట్రావెల్. తను ఎప్పటి నుండో ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నాడు. సడెన్ గా ఒక స్క్రిప్ట్ ఉంది ప్రొడ్యూస్ చేస్తారా ? అని అడిగితే నాన్న నన్ను వినమన్నారు. ఈ స్క్రిప్ట్ విన్నాక ఎవరితో అయినా చేద్దామని కొందరు హీరోలకి స్క్రిప్ట్ వినిపించాం. కానీ ఈ కాన్సెప్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ కథ నీకు సూటవుతుంది నువ్వే చేసేయ్ అన్నారు. అలా ఫైనల్ గా ఓన్లీ ప్రొడ్యూస్ చేద్దామనుకున్న నేనే హీరోగా చేయాల్సి వచ్చింది. కానీ ఇలాంటి కాన్సెప్ట్ తో చేయడం యాక్టర్ గా మంచి కిక్ ఇచ్చింది.

 pushpaka vimanam

ఆ విషయం చెప్పలేక 

సినిమాలో నేను టీచర్ గా కనిపిస్తాను. పెళ్లయిన కొత్తలో పెళ్ళాం లేచిపోతే ఒక భర్త పడే ఇబ్బందులు, నలుగురికి విషయం తెలియకుండా దాచి పెడుతూ కవరింగ్ చేసే క్యారెక్టర్ లో నటించాను. నా క్యారెక్టర్ తో ఇటు సింపతీ అటు ఫన్ రెండూ వర్కౌట్ అయ్యాయి. సినిమాలో చాలా లేయర్స్ ఉంటాయి. కానీ ఎంటర్టైన్ మెంట్  లేయర్ ఎక్కువగా ఎక్స్ పోజ్ అవుతుంది.

ప్రతీ వ్యక్తిపై అనుమానం 

సునీల్ గారు , నరేష్ గారు మిగతా క్యారెక్టర్స్ అన్నీ కథలో చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి. ముఖ్యంగా సునీల్ అన్న ప్రతీ విషయంపై అనుమాన పడుతూ అందరి మీద డౌట్ పడే పోలీస్ క్యారెక్టర్ లో నటించాడు. ఆ క్యారెక్టర్ లో సీరియస్ నెస్ తో పాటు ఫన్ కూడా ఉంటుంది.

 

టీచర్ గానా ? అనుకున్నా 

ఈ కథ నన్ను చేయమని నాన్న చెప్పినప్పుడు నేను టీచర్ గానా ? అదీ పెళ్ళయిన భర్త క్యారెక్టరా ? అసలు సూటవుతానా ? అనుకున్నాను. కానీ లుక్ టెస్ట్ చేసి చూస్తే సూటయ్యనని అనిపించింది. పైగా నాకు ఛాలెంజింగ్ రోల్ అనిపించింది. అందుకే ఎక్కువ ఆలోచించకుండా సెట్స్ పైకి వెళ్ళిపోయాం.

ఇలాంటి కథలు చేయాలి 

నిజానికి పెళ్ళాం లేచిపోయింది అనే కాన్సెప్ట్ తో ఇలాంటి ఫన్నీ కాన్సెప్ట్ ఫిలిం చేయడం రిస్క్ అనే చెప్పాలి. కానీ మా డైరెక్టర్ దామోదర సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. సినిమా చూశాక మా అందరికీ చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. మిగతా భాషల్లో ఇలాంటి సినిమాలు వస్తుంటాయి కానీ మనకి కాస్త కొత్త. బట్ యాక్టర్ గా ఇలాంటి కథలు కూడా చేయాలని నమ్ముతాను. అందుకే ఈ స్క్రిప్ట్ ఎంచుకొని ఒక రిస్క్ చేశాను.

 – Anasuya Pushpa movie- అడకత్తెరతో దాక్షాయణి

విజయ్ కి కాన్ఫిడెన్స్ పెరిగింది

ఈ కథ విజయ్ కి ఎప్పుడో తెలుసు. సినిమా చేసే ముందు కూడా తనకి ఒక ఒపినియన్ ఉంది. కానీ ఫిలిం చూశాక ఒక నిర్మాతగా సినిమా బాగా వచ్చింది. దీన్ని మనం పుష్ చేయాలి అన్నాడు. అప్పటి నుండి సినిమాపై తనకి కాన్ఫిడెన్స్ పెరిగింది. రేపు ఆడియన్స్ కి కూడా నచ్చితే ఇలాంటి మరిన్ని కథలు చేయడానికి ఆసక్తి ఉంటుంది.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అవే 

నెక్స్ట్ ఒక మూడు సినిమాలు చేస్తున్నాను. అందులో ఒకటి కేవీ గుహన్ గారితో ‘హైవే’. అది కంప్లీట్ రోడ్ జర్నీ మూవీ.  సాయి రాజేష్ తో ‘బేబీ’ అనే ఇంకో సినిమా చేస్తున్నాను. అలాగే కొత్త డైరెక్టర్ తో మరో సినిమా ఉంది.

– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics