అమైరా దస్తూర్ ఇంటర్వ్యూ

Thursday,May 31,2018 - 01:27 by Z_CLU

జూన్ 1 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది ‘రాజుగాడు’. మనసుకు నచ్చింది సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయిన అమైరా దస్తూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇటు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను బిజీ అవుతున్న ఈ హీరోయిన్, ‘రాజుగాడు’ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. అవి మీకోసం…

అలా జరిగింది…

2016 లో సంజనా నాకీ సినిమా గురించి చెప్పింది. ఒకరకంగా ఈ సినిమా తెలుగులో నా డెబ్యూ మూవీ అవ్వాలి. కానీ డేట్ ఇష్యూస్ వల్ల ఫస్ట్ ‘మనసుకు నచ్చింది’ రిలీజయింది.

నా క్యారెక్టర్ కి 2 షేడ్స్…

సినిమా ఫస్టాఫ్ లో మ్యాగ్జిమం హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది కాబట్టి మాడరన్ గా, హైదరాబాదీలా ఉంటుంది నా క్యారెక్టర్. ఇక సెకండాఫ్ లో విలేజ్ సెటప్ లో ఉంటుంది కాబట్టి ట్రెడిషనల్ గా కనిపిస్తాను.

రాజ్ తరుణ్ తో…

రాజ్ తరుణ్ నా కన్నా జస్ట్ 1 ఇయర్ ఓల్డ్. కాబట్టి ఆల్మోస్ట్ మేం చూసే టి.వి. షోస్,  సినిమాలు అన్నీ ఒకేలా ఉంటాయి. ఆఫ్ కెమెరా కూడా చాలా ఫన్నీగా ఉంటాడు రాజ్. ఇప్పుడు నాకు రాజ్ క్లోజ్ ఫ్రెండ్.

చేసిన 3 సినిమాలకు అంతే…

బాలీవుడ్ లో చేస్తున్న ‘రాజ్మా చావల్’ కి కూడా లేడీ డైరెక్టరే… తరవాత మంజుల, ఇప్పుడు సంజనా.. నా కరియర్ లో ఇప్పటి వరకు లేడీ డైరెక్టర్సే…

సంజనా గురించి…

సంజనా చాలా స్ట్రాంగ్ విమెన్… షూటింగ్ లో ఎప్పుడు చూసిన అటూ ఇటూ వెళ్తూనే ఉంటుంది. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకుంటూ ఉంటుంది…  తనకు ఏ షాట్ కావాలో పక్కా క్లారిటీ ఉంటుంది…

 

ప్రస్థానం హిందీ రీమేక్…

ప్రస్థానం హిందీ రీమేక్ జూన్ నుండి షూటింగ్ బిగిన్ అవుతుంది. టాలీవుడ్ లో సూపర్ హిట్టయిన సినిమా అది.  చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నా…

ఇంకా కలవలేదు..

నేనింకా సంజయ్ దత్ ని కలవలేదు. దేవకట్ట గారిని కలిశాను. మొత్తం టీమ్ ముహూర్తం రోజు కలుస్తున్నాం…

అందుకే చాలా హ్యాప్పీ…

బాలీవుడ్ లో 2 సినిమాలకు చేస్తున్నాను. రెండు సినిమాలకు కూడా సౌత్ డైరెక్టర్సే… దేవకట్ట గారి తో ప్రస్థానం రీమేక్, ప్రకాష్ కోవెల మూడి డైరెక్షన్ లో ‘మెంటల్ హై క్యా..’ చేస్తున్నాను.

అదే నా డ్రీమ్ రోల్…

నాకు పద్మావత్ లాంటి సినిమా చేయాలని ఉంది. సంజయ్ లీలా భన్సాలి నా డ్రీమ్ డైరెక్టర్. ఆయన డైరెక్షన్ లో చేయాలని ఉంది. జోదా అక్బర్ లాంటి ఓల్డ్ స్టోరీస్ చేయడమన్నా చాలా ఇష్టం…