అమితాబ్ కు కరోనా.. నిలకడగా ఆరోగ్యం

Sunday,July 12,2020 - 10:02 by Z_CLU

తనకు కరోనా సోకిన విషయాన్ని రాత్రి స్వయంగా అమితాబ్ బచ్చన్ ప్రకటించారు. రాత్రికి రాత్రి ఆయన హాస్పిటల్ లో చేరారు. ముంబయిలోని నానావతి హాస్పిటల్ లో అమితాబ్ కు రాత్రి నుంచే ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందంటున్నారు డాక్టర్లు.

మరోవైపు అమితాబ్ కొడుకు అభిషేక్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అతడు కూడా తండ్రితో పాటు అదే హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. మిగతా కుటుంబ సభ్యుల టెస్ట్ ఫలితాలు ఈరోజు వస్తాయి.

అమితాబ్ భార్య జయా బచ్చన్, అభిషేక్ భార్య ఐశ్వర్యరాయ్ కు కరోనా వైరస్ యాంటీజెన్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చింది. ఈరోజు శ్వాబ్ టెస్ట్ ఫలితాలు రాబోతున్నాయి. వీళ్లతో పాటు మిగతా స్టాఫ్, డ్రైవర్లకు సంబంధించిన ఫలితాలు కూడా ఈరోజు రాబోతున్నాయి.

ఒకవేళ రిజల్ట్ పాజిటివ్ వస్తే, లక్షణాలు బట్టి హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ ఇవ్వాలా, ఇంట్లోనే ట్రీట్ మెంట్ కొనసాగించాలా అనే విషయాన్ని డాక్టర్లు నిర్ణయిస్తారు.

77 ఏళ్ల అమితాబ్ రెస్ట్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నటించిన గులాబో సితాబో సినిమా ఓటీటీలో రిలీజైంది. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర, చెహ్రే సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అటు అభిషేక్ బచ్చన్ నటించిన బిగ్ బుల్ అనే సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది.

బిగ్ బికి పాజిటివ్ రావడంతో టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలేకుండా అంతా షాక్ అయ్యారు. బాలీవుడ్ స్టార్స్ నుంచి సౌత్ కు చెందిన చిరంజీవి, మహేష్ లాంటి ఎంమమంది హీరోలు అమితాబ్ త్వరగా కోలుకోవాలని కాంక్షించారు.