ఎవైటింగ్ మూవీస్ రిలీజ్ డేట్స్

Saturday,August 11,2018 - 05:10 by Z_CLU

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో  ఎవైటింగ్ మూవీస్ గా తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ అంటోనీ’,’సవ్య సాచి’ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసారు. నిన్నటి వరకూ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘సవ్యసాచి’ రిలీజ్ డేట్స్ పై ఫాన్స్ కున్న డౌట్స్ కి  రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ తో క్లారిటీ ఇచ్చేసారు మేకర్స్.

శ్రీను వైట్ల డైరెక్షన్ లో రవితేజ , ఇలియానా  నటిస్తున్న ‘అమర్ అక్బర్ అంటోనీ’ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుందని ఈ సినిమాను అక్టోబర్ 5న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన మేకర్స్ , చందూ మొండేటి డైరెక్షన్ లో నాగ చైతన్య , నిధి అగర్వాల్ జంటగా  మాధవన్, భూమిక ముఖ్య పాత్రలు పోషిస్తున్న  ‘సవ్య సాచి’ సినిమాను నవంబర్ 2న విడుదల చేయనున్నట్లు  ప్రకటించారు.