జెర్సీ తమిళ రీమేక్ లో హీరోయిన్ ఫిక్స్

Monday,August 12,2019 - 11:21 by Z_CLU

తెలుగులో ఎమోషనల్ బ్లాక్ బస్టర్ గా పేరుతెచ్చుకున్న జెర్సీ సినిమా బాలీవుడ్, కోలీవుడ్ లో రీమేక్ అవుతోంది. అయితే బాలీవుడ్ కంటే ముందే కోలీవుడ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేలా ఉంది. తమిళ్ లో ఈ సినిమా రీమేక్ లో విష్ణు విశాల్ హీరోగా నటించబోతున్నాడు. అతడి సరసన హీరోయిన్ గా అమలాపాల్ ను సెలక్ట్ చేశారు.

జెర్సీలో హీరోకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో, హీరోయిన్ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. తెలుగులో ఈ పాత్రను శ్రద్ధాశ్రీనాధ్ పోషించింది. ఇప్పుడా పాత్రను తమిళ్ లో అమలాపాల్ చేయబోతోంది. నెల్సన్ దర్శకత్వంలో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. గతంలో విష్ణువిశాల్-అమలాపాల్ కాంబోలో రాట్ససన్ సినిమా వచ్చింది.

జెర్సీ సినిమాలో చాలా లేయర్స్ ఉన్నాయి. తండ్రికొడుకుల అనుబంధం, క్రికెట్ బ్యాక్ డ్రాప్, ఓ అందమైన ప్రేమకథ, ఓ మిడిల్-క్లాస్ ఫ్యామిలీ.. ఇలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ అద్భుతంగా తెరకెక్కింది జెర్సీ.