అమైరా దస్తూర్ ఇంటర్వ్యూ

Wednesday,January 24,2018 - 10:03 by Z_CLU

సందీప్ కిషన్ ‘మనసుకు నచ్చింది’ సినిమా ఫిబ్రవరి 16 న రిలీజ్ కి రెడీ అవుతుంది. మంజుల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సందర్భంగా ఈ మూవీ హీరోయిన్ అమైరా దస్తూర్ ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ మీకోసం….

 

అలా జరిగింది ….

మంజుల గారు నన్ను లాస్ట్ ఇయర్ అప్రోచ్ అయ్యారు. కానీ అప్పుడు వర్కవుట్ కాలేదు. ఆ తరవాత ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు,  స్పెషల్లీ సినిమాలో నేను ప్లే చేసిన క్యారెక్టర్, నా ఆటిట్యూడ్ కి చాలా దగ్గరగా ఉంటుంది.

 

అదే నా క్యారెక్టర్…

ఈ సినిమాలో నేను యోగ టీచర్ లా నటించాను. తన మనసుకు నచ్చిన పని చేసే ఒక మిడిల్ క్లాస్ తెలుగమ్మాయి ఎలా తన బెస్టీ గుర్తిస్తుంది… అనేదే నా క్యారెక్టర్….

ఫ్యామిలీ గురించి….

మాది చాలా క్రేజీ ఫ్యామిలీ… నన్ను చాలా స్వతంత్రంగా పెంచారు. టీనేజ్ వరకు నేను బోర్డింగ్ స్కూల్ లో చదివాను…

ప్రాక్టీస్ కోసం వెళ్లినట్టు….

షూటింగ్ టైమ్ లో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎవ్రీ డే ఏదో యాక్టింగ్ ప్రాక్టీస్ కి వెళ్లినట్టు అనిపించేది. అందరం చాలా జాలీగా స్పెండ్ చేసే వాళ్ళం….

 

కొత్త లాంగ్వేజ్….

నాకు తమిళం కూడా రాదు.. ఫస్ట్ టైమ్ తమిళ్ సినిమాలో చేశాక, తెలీని లాంగ్వేజ్ లో కూడా నాటిన్చాగాలను అని కాన్ఫిడెన్స్ వచ్చింది. అలా తెలుగు కూడా ఈజీ అయిపోయింది.

సందీప్ కిషన్ గురించి….

సందీప్ కిషన్ అప్ కమింగ్ హీరోయిన్స్ కి చాలా లక్కీ అని విన్నాను. అందుకు చాలా చాలా హ్యాప్పీగా ఉంది.

నటించాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది..?

ఏ టెన్షన్ లో ఉన్న ఒక సినిమా చూడటం మొదలుపెట్టామంటే ఆ 2 గంటలపాటు టెన్షన్స్ అన్ని మర్చిపోతాం. చిన్నప్పుడు కూడా నేను అలాగే చేసేదాన్ని. అందుకే నేను సినిమాలు చేయాలని అనుకున్నాను.