Sankranthi Release - మరో మూవీ కన్ఫర్మ్

Monday,September 21,2020 - 12:31 by Z_CLU

సంక్రాంతి టార్గెట్ గా చాలా సినిమాలు సిద్దమవుతున్నాయి. ఈసారి ఎప్పటిలా 2-3 సినిమాలు కాకుండా ఓ ఐదారు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి. ఇప్పటికే Nithin ‘Rang De’ సినిమా సంక్రాంతి కన్ఫర్మ్ అంటూ ఎనౌన్స్ కాగా తాజాగా మరో సినిమా కన్ఫర్మ్ చేసారు మేకర్స్.

బెల్లంకొండ శ్రీనివాస్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘Alludu Adhurs’ కూడా సంక్రాంతి కి రిలీజ్ చేయనున్నామని ప్రకటించారు. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన షూటింగ్ ఈరోజు నుండి మొదలు పెట్టారు. హైదరాబాద్ లో హీరో శ్రీనివాస్, ప్రకాష్ రాజ్ లపై కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నారు. త్వరలోనే మిగిలిన షూట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి విడుదలకి రెడీ చేయనున్నారు.

ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలు వచ్చే సంక్రాంతికి కర్చీఫ్ వేసుకున్నాయి. ఇక నాగచైతన్య ‘Love Story’తో పాటు గోపీచంద్ ‘Seetimar’ను జనవరి బరిలో దింపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక Pawan Kalyan ‘Vakeel Saab’ వచ్చే సంక్రాంతికే అంటూ ప్రచారం జరుగుతుంది. ఒకవేళ Power Star సంక్రాంతి పోటీ లో నిలిస్తే మిగతా సినిమాలు వాయిదా పడే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో ‘వకీల్ సాబ్’ రిలీజ్ పై దీనిపై క్లారిటీ రానుంది.