Allu Studios - భారీ ప్లాన్ లో అరవింద్

Thursday,October 01,2020 - 03:16 by Z_CLU

హైదరాబాద్లో షూటింగ్స్ కి సంబంధించి పలు స్టూడియోలున్నాయి. ఇప్పుడు అల్లు కుటుంబం కూడా Allu Studios పేరుతో భారీ స్టూడియో నిర్మాణానికి రెడీ అయింది. ఈరోజు స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా స్టూడియో నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ తో పాటు అల్లు వెంకటేష్, అల్లు అర్జున్ , అల్లు శిరీష్ లు పాల్గొన్నారు.

గచ్చిబౌలిలో ఏడు ఎకరాల స్థలంలో ఈ స్టూడియో నిర్మాణం కానుంది. లేటెస్ట్ టెక్నాలజీతో భారీ స్టూడియోగా దీన్ని నిర్మించనున్నట్లు అల్లు కుటుంబం తెలియజేసింది. మరి Allu Studios ఎలా రూపాంతరం చెందుతుందో ఎలాంటి ఎక్విప్ మెంట్ తో నిర్మాణమవుతుందో ఇంకొన్ని నెలల్లో తెలియనుంది.