Allu Sneha Reddy - బన్నీ భార్యకు కూడా ఫాలోయింగ్

Thursday,June 17,2021 - 05:38 by Z_CLU

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తిమ‌ణి అల్లు స్నేహ ప్ర‌ఖ్యాత సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో స‌రికొత్త రికార్డ్ సృష్టించారు, దేశంలో ఏ స్టార్ వైఫ్ కి లైనంత ఫాలోయివ‌ర్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ ఇన్ స్టాగ్రామ్ లో సంపాదించుకున్నారు.

మొత్తంగా 4 మిలియ‌న్ల ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ తో అల్లు స్నేహ ఓ స‌రికొత్త రికార్డు సృష్టించారు. ఎలాంటి సినిమా నేప‌థ్యం లేకుండా స్నేహ ఈ ఘ‌న‌త అందుకోవ‌డం విశేషం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త‌న పిల్ల‌లు అయాన్, ఆర్హల‌తో ఆడ‌కునే స్వీట్ ముమెంట్స్ తో పాటు త‌నకు ఆస‌క్తిగా అనిపించే వివ‌ధ ర‌కాల రంగాల‌కు సంబంధించిన పోస్ట్ లు అల్లు స్నేహా చేస్తుంటారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics