అల్లు శిరీష్ 'ఏబీసీడీ' షూటింగ్ అప్ డేట్స్

Sunday,November 04,2018 - 10:03 by Z_CLU

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏబీసీడీ’. యూత్ ఫుల్ ఫన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. నవంబర్ లాస్ట్ వీక్ లేదా డిసెంబర్ లో అమెరికాలో ఓ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అమెరికా షెడ్యుల్ తో టాకీ పార్ట్ ఫినిష్ చేసి బ్యాలెన్స్  సాంగ్ ని హైదరాబాద్ లో షూట్ చేయనున్నారు.

సంజీవ్ రెడ్డి  డైరెక్షన్ లో తెరకెక్కుతున్న  ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. మధుర ఎంటర్ టైన్ మెంట్స్,బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్  మధుర శ్రీధర్ రెడ్డి  , బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 15 నాటికి టోటల్ షూటింగ్ పూర్తిచేసుకోనున్న ఈ సినిమా ఫిబ్రవరి 8న  విడుదల కానుంది.