రిలీజ్ కి రెడీ అవుతున్న అల్లు శిరీష్ యుద్ధభూమి

Wednesday,February 21,2018 - 11:02 by Z_CLU

అల్లు శిరీష్ నటించిన మళయాళ మూవీ ‘1971 బియాండ్ బార్డర్స్’ ఇప్పుడు తెలుగులో రిలీజ్ కి రెడీ అవుతుంది. ‘యుద్ధభూమి’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మోహన్ లాల్ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమాలో అల్లు శిరీష్ పవర్ ఫుల్ సైనికుడిలా నటించాడు.

ఇండియన్ ఆర్మీలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి మేజర్ రవి డైరెక్టర్. ఆయన మేజర్ గా ఇండియన్ ఆర్మీలో పని చేసినప్పుడు, స్వతహాగా హ్యాండిల్ చేసిన కొన్ని ఆర్మీ ఆపరేషన్స్ ని రిఫరెన్స్ గా తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టయింది.

 

సిద్ధార్థ్ విపిన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని A.N. బాలాజీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మార్చి ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.