అల్లు శిరీష్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్

Saturday,June 02,2018 - 11:02 by Z_CLU

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించగా… సూపర్ డూపర్ హిట్టయిన ఎబిసిడి (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్ డ్ దేసి ) సినిమాను తెలుగులో అల్లు శిరీష్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన నటించే  రుక్షార్ థిల్లాన్ సొంతం చేసుకుంది. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో నటించిన రుక్షార్ ఇప్పుడు ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన జత కట్టనుంది.

సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నరు.