శిరీష్ మొదలెట్టేసాడు

Monday,April 10,2017 - 01:00 by Z_CLU

‘శ్రీరస్తు శుభమస్తు’ తర్వాత మోహన్ లాల్ సినిమాతో మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ ఎట్టకేలకి తెలుగులో తన నెక్స్ట్ సినిమాను సెట్స్ పై పెట్టబోతున్నాడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వి.ఐ.ఆనంద్ డైరెక్షన్ లో రొమాంటిక్ థ్రిల్లర్ గా సాగే సైన్టిఫిక్ ఫిక్షన్ స్టోరీ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఇటీవలే పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.

లక్ష్మి నరసింహ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్మించనున్న ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన సురభి, శీరత్ కపూర్ హీరోయిన్స్ గా నటిస్తుండగా అవసరాల శ్రీనివాస్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది..