నా కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్

Saturday,May 18,2019 - 12:42 by Z_CLU

నిన్న థియేటర్లలోకి వచ్చిన ఏబీసీడీ సినిమా తన కెరీర్ లోనే బెస్ట్ అంటున్నాడు అల్లు శిరీష్. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో నటుడిగా చాలా నేర్చుకున్నానని అంటున్నాడు. మూవీ సక్సెస్ ను యూనిట్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు.

అల్లు శిరీష్ మాట్లాడుతూ – “ఏబీసీడీకి నా కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. కొత్త జంట‌, శ్రీర‌స్థు శుభ‌మ‌స్తు సినిమాల‌కు బెట‌ర్‌గా ఓపెన్ అయ్యింది. ప‌ర్స‌న‌ల్‌గా ఆర్టిస్ట్‌గా ఎదిగిన ఫీలింగ్ క‌లుగుతుంది. ఈ రోల్‌లో చేస్తున్న‌ప్పుడు క‌నెక్ట్ అయ్యి బాగాఎంజాయ్ చేస్తూ చేశాను. ప్ర‌తి షోకు క‌లెక్ష‌న్స్ పెరుగుతూ వ‌స్తున్నాయి. మ‌ధుర గారు కోరుకున్న‌ట్లు శ్రీర‌స్థు శుభ‌మ‌స్తు సినిమా క‌లెక్ష‌న్స్‌ను దాటాల‌ని కోరుకుంటున్నాను. నాకు మంచి సినిమా ఇచ్చిన మ‌ధుర శ్రీధ‌ర్‌ గారికి, మంచి థియేట‌ర్స్ ఇచ్చి రిలీజ్ చేయించిన సురేష్‌బాబుగారికి థాంక్స్‌.

సంజీవ్ న‌న్ను చూడ‌ని విధంగా కొత్తగా ప్రెజెంట్ చేశాడు. అంద‌రూ బాగున్నాన‌ని, బాగా చేశావ‌ని అంటున్నారంటే ఆ క్రెడిట్ మొత్తం సంజీవ్‌కే ద‌క్కుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు నా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ ఎప్పుడూ రాలేదు. సంజీవ్‌, రామ్‌ తోట‌ల‌కు థాంక్స్‌. ఈ స‌మ్మ‌ర్‌లో ఫ్యామిలీస్‌ను ఎంట‌ర్‌టైన్ చేసే ఫ‌ర్‌ఫెక్ట్ మూవీ ఇది“ అన్నాడు