కన్ఫ్యూజ్డ్ దేసీగా అల్లు శిరీష్

Saturday,October 13,2018 - 10:02 by Z_CLU

అల్లు అర్జున్ ABCD ఫిబ్రవరి 8 న రిలీజవుతుంది. హిలేరియస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు శిరీష్ కన్ఫ్యూజ్డ్ దేశీ లా కనిపించనున్నాడు. ఫారిన్ లో ఏ మాత్రం బాధ్యత లేని యంగ్ స్టర్ లా ఉండే కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో ఇండియాకి వచ్చి, ఫాదర్ ఇచ్చే జస్ట్ 5000 ల పాకెట్ మనీతో ఇండియాలో ఎలా బ్రతకగాలిగాడు..? ఈ జర్నీలో ఏం తెలుసుకున్నాడు అనేదే ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్.

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మళయాళ బ్లాక్ బస్టర్  ‘ABCD’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ సినిమా. ఈ సినిమా తెలుగులో తెలుగులో అదే రేంజ్ లో సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిలిమ్ మేకర్స్. ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తుంది.

కన్నడ లో సక్సెస్ ఫుల్ మ్యూజిక్ కంపోజర్ జుధా సాంధీ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్, యష్ రంగినేని సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సజేవ్ రెడ్డి డైరెక్టర్.