సమ్మర్ లో మెగాహీరో సినిమా రిలీజ్

Tuesday,January 15,2019 - 12:03 by Z_CLU

మెగాహీరో అల్లు శిరీష్ సినిమా ‘ABCD’ సినిమా రిలేజ్ డేట్ ఫిక్సయింది. ఆల్మోస్ట్ షూటింగ్ ప్యాకప్ చెప్పేసిన మేకర్స్ ఈ సినిమాని మార్చి 1 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. రీసెంట్ గా ఈ సినిమా కలర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేసిన మేకర్స్, ఈ సినిమా ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచే ఆలోచనలోఉన్నారు.

మలయాళంలో సూపర్ హిట్టయిన ‘ABCD’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ సినిమా. మళయాళ వర్షన్ లో దుల్కర్ సల్మాన్ ప్లే చేసిన రోల్ లో, తెలుగులో అల్లు శిరీష్ నటిస్తున్నాడు. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో మోస్ట్ ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతుంది.

జుధా సాంధీ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రుక్సార్ థిల్లాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా మధుర ఎంటర్ టైన్ మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.