రేపే అల్లు శిరీష్ ‘ABCD’ ఫస్ట్ లుక్ రిలీజ్

Thursday,December 27,2018 - 03:50 by Z_CLU

రేపు మధ్యాహ్నం 12:30 కు అల్లు శిరీష్ ‘ABCD’ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ‘అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగబాబు, అల్లు శిరీష్ కి ఫాదర్ గా, కీ రోల్ లో కనిపించనున్నాడు. మళయాళ సూపర్ హిట్ సినిమా ‘ABCD’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు శిరీష్ కంప్లీట్ గా డిఫెరెంట్ డైమెన్షన్ లో కనిపించనున్నాడు.

మరీ బాధ్యత లేకుండా తిరిగే యంగ్ స్టర్ లా  నటిస్తున్నాడు అల్లు శిరీష్  ఈ సినిమాలో. తనని ఎలాగైనా ట్రాక్ లో పెట్టాలనే ఉద్దేశంతో, లిమిటెడ్ పాకెట్ మనీ చేతిలో పెట్టి, లైఫ్ వ్యాల్యూ తెలియాలంటే ఇండియా కన్నా బెస్ట్ ప్లేస్ ఉండదు అన్న ఉద్దేశంతో, కొడుకును ఇండియాకి పంపించే స్ట్రిక్ట్ ఫాదర్ గా నాగబాబు, ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు.

ఈ రోజు ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్, రేపు రిలీజవుతున్న ఫస్ట్ లుక్ తో మరింత ఇంప్రెస్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. సంజీవ్ రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి జుధా సాంధీ మ్యూజిక్ కంపోజర్.