అల్లు శిరీష్ ‘ABCD’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజయింది

Friday,December 28,2018 - 01:53 by Z_CLU

అల్లు శిరీష్ కొత్త సినిమా ‘ABCD’ మోషన్ పోస్టర్ తో పాటు, ఫస్ట్ లుక్ రిలీజయింది. ‘అమెరికన్ బార్న్  కన్ఫ్యూజ్డ్ దేశీ’  అనే ట్యాగ్ లైన్ కి తగ్గట్టే ఈ మోషన్ పోస్టర్ ని కూడా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసుకున్నారు మేకర్స్. ఈ మోషన్ పోస్టర్ ని అమెరికా బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ చేసి, ఇండియా వీధుల్లో క్లోజ్ చేశారు మేకర్స్, ఇక అల్లు శిరీష్ స్కేట్ బోర్డ్ పై మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

మలయాళంలో సూపర్ హిట్టయిన ‘ABCD’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ సినిమా. మళయాళ వర్షన్ లో దుల్కర్ సల్మాన్ ప్లే చేసిన రోల్ లో, తెలుగులో అల్లు శిరీష్ నటిస్తున్నాడు. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో మోస్ట్ ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతుంది.

జుధా సాంధీ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రుక్సార్ థిల్లాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా మధుర ఎంటర్ టైన్ మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్.