PushpaTrailer కంటెంట్ తో క్లారిటీ ఇచ్చేసిన సుక్కు !

Tuesday,December 07,2021 - 03:28 by Z_CLU

అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటింగ్ మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ప(ది రైజ్)‘ ట్రైలర్ రిలీజైంది. ప్రస్తుతం మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తున్న ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొలుపుతుంది.  టీజర్ తో కంటెంట్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్ తాజాగా రిలీజైన ట్రైలర్ తో సినిమాపై ఉన్న అన్ని డౌట్స్ కి క్లారిటీ ఇచ్చేసి బజ్ క్రియేట్ చేస్తున్నాడు.

భూమండలం లో ఎడా పెరగని సెట్టు మన శేషాచలం అడవుల్లో పెరుగుతుండాది.. ఈడ నుండే వేల కోట్ల సరుకు విదేశాలకు స్మగ్లింగ్ అవుతాండది. గోల్డ్ రా ఇది. భూమి పై పెరిగే బంగారం. పేరు ఎర్ర చందనం” అంటూ అజయ్ ఘోష్ వాయిస్ తో మొదలయ్యే ట్రైలర్ లో అడవిలో ఎర్ర చందనం నరికడం , ఎగుమతి చేయడం లాంటి షాట్స్ తో మొదలైన ట్రైలర్ లో తర్వాత బన్నీ లుక్ , క్యారెక్టర్ బెహేవియర్ , హీరోయిన్ రష్మిక తో వచ్చే లవ్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ఇక పుష్ప రాజ్ కి ఒక బాస్ ఉన్నాడని ఆ బాస్ ఎవరనేది మిస్టరీ అన్నట్టుగా పోలీస్ స్టేషన్ లో కొడుతూ ఎంక్వైరీ సీన్ ట్రైలర్ లో యాడ్ చేసి క్యూరియాసిటీ రైజ్ చేశారు. అలాగే సినిమాలో బన్నీ డ్యుయల్ రోల్ లో కనిపిస్తాడా ? అనిపించేలా రెండు గెటప్స్ తో బన్నీ షాట్స్ చూపించారు.

ట్రైలర్ లో కథ ఇది అని క్లారిటీగా చెప్పేసిన సుక్కు కొన్ని షాట్స్ తో క్యారెక్టర్స్ కూడా చూపించి ఎట్రాక్ట్ చేశాడు. అలాగే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మరోసారి ట్రైలర్ ద్వారా చెప్పకనే చెప్పాడు. “ఈ లోకం మీకు తుపాకీ ఇచ్చింది నాకు గొడ్డలి ఇచ్చింది యెవుడి యుద్ధం ఆడిదే” అంటూ బన్నీ చిత్తూర్ స్లాంగ్ లో చెప్పే డైలాగ్ కూడా ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది. క్లైమాక్స్ లో ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ? ఫైరు” అని బన్నీ చెప్పిన వెంటనే వచ్చే ఫైర్ షాట్ మంచి ఎలివేషన్ ఇచ్చింది.

 ముఖ్యంగా క్యూబా బ్రోజెక్  విజువల్స్ దేవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్  ట్రైలర్ కి మెయిన్ హైలైట్ గా నిలిచాయి. ఓవరాల్ గా సుక్కు నుండి మరో బెస్ట్ ఫిలిం రానుందని ‘పుష్ప’ పార్ట్ 1 ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 17న ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజవుతుంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics