Allu Arjun PUSHPA - పార్ట్-2కు సెపరేట్ టైటిల్

Tuesday,May 18,2021 - 04:03 by Z_CLU

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ రెండు భాగాలుగా రానుందని మేకర్స్ ప్రకటించడంతో పార్ట్ 2 పై ఇప్పటి నుండే చర్చ లు మొదలయ్యాయి. మొదటి భాగానికి పుష్ప అని టైటిల్ పెట్టిన సుకుమార్ కొనసాగింపు భాగానికి ఎలాంటి టైటిల్ పెడతాడా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నరు. అయితే రెండో భాగానికి టైటిల్ కి 2 నంబర్ చేర్చే ఆలోచనలో లేరట మేకర్స్. అవును పార్ట్ 2 కి సంబంధించి పుష్ప టైటిల్ తర్వాత మరో పవర్ ఫుల్ క్యాప్షన్ పెట్టే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

ఇటివలే విడుదల చేసిన పుష్ప టీజర్ లో బన్నీ చెప్పిన ‘తగ్గేదే లే’ డైలాగ్ వైరల్ అయ్యింది. ఇటు ఫ్యాన్స్ లో అటు ప్రేక్షకుల్లో ఆ పదం బాగా నానుతుంది. అందుకే రెండో భాగానికి ‘పుష్ప… తగ్గేదే లే’అని పెట్టబోతున్నారని ఇన్సైడ్ టాక్. దీనితో పాటు మరో రెండు క్యాప్షన్లు లిస్టులో పెట్టుకున్నారట. మొదటి భాగం చివరిలో రెండో భాగానికి సంబంధించి ఆ టైటిల్ రివీల్ చేయనున్నారు. అప్పటి వరకు ఏదొకటి ఫైనల్ చేస్తారు.

అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో మూడో సినిమాగా వస్తున్న పుష్ప సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ కూడా సినిమాపై అమాంతంగా అంచనాలు పెంచేసేలా కట్ చేశారు. ఇక దేవి కంపోజ్ చేసిన సాంగ్స్ సినిమా రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయని యూనిట్ అంటోంది. సుక్కు సినిమాలకు బన్నీ సినిమాలకు స్పెషల్ ఫోకస్ పెట్టి మ్యూజిక్ ఇస్తాడు దేవి ఇది అందరికీ తెలిసిందే. వారి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది మరి. ‘ఆర్య’తో మొదలైన ఈ కాంబోలో వచ్చిన ‘ఆర్య 2’ సాంగ్స్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మరి ఈ కాంబో లో రాబోయే సాంగ్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics