Allu Arjun PUSHPA - రిలీజ్ డేట్ లాక్?

Tuesday,May 11,2021 - 04:19 by Z_CLU

అల్లు అర్జున్ -సుకుమార్ కాంబోలో మూడో సినిమాగా వస్తున్న మోస్ట్ ఎవైటింగ్ ‘పుష్ప’ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ఓ అప్ డేట్ బయటికొచ్చింది. సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నరనేది ఆ అప్ డేట్. అయితే ముందుగా మొదటి భాగాన్ని ఆగస్ట్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోన సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటం, బన్నీ కి కోవిడ్ పాజిటివ్ రావడం కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో రిలీజ్ కూడా వాయిదా పడింది. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఆగస్ట్ లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశమే లేదు.

సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అలాగే సాంగ్స్ కూడా షూట్ చేయాల్సి ఉందని తెలుస్తుంది. సో షూటింగ్ మొదలు కావడానికి ఇంకా రెండు మూడు నెలలు పట్టొచ్చు. అందుకే మరో డేట్ లాక్ చేసుకున్నారు మేకర్స్. అక్టోబర్ 13 న దసరా కానుకగా సినిమాను థియేటర్స్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారట. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించి ప్రేక్షకులకు క్లారిటీ ఇవ్వబోతున్నారట.

allu arju pushpa movie zeecinemalu

రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ -రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘RRR’అక్టోబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆ సినిమా కూడా షూటింగ్ వాయిదా పడిన కారణంగా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అందుకే ఆ సినిమా డేట్ పై ఇప్పుడు పుష్ప నిర్మాతలు కన్నేశారు. అందుకే పుష్ప ను ఆ డేట్ కి విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. అక్టోబర్ లో మొదటి భాగాన్ని విడుదల చేసి రెండో భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. టీజర్ తో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా నాలుగు భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics