Pushpa First Single promo - అస్సలు తగ్గేదేలే

Tuesday,August 10,2021 - 03:10 by Z_CLU

పుష్ప ఫస్ట్ సింగిల్ ను ఆగస్ట్ 13న విడుదల చేయబోతున్నట్టు ఇది వరకే ప్రకటించారు. ఇప్పుడా హీట్ ను మరింత పెంచారు. ఫస్ట్ సింగిల్ ఎలా ఉండబోతోందో చెబుతూ.. ఓ ప్రోమో రిలీజ్ చేశారు. ఇప్పుడీ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బన్నీ-దేవిశ్రీ కలిసి ఈ వీడియోలో ముందుగా కనిపించారు. ఆ తర్వాత సినిమాలోకి ఎంటరయ్యారు. అల్లు అర్జున్ చేతిలో లాంతరు పట్టుకుంటే.. చీకట్లను చీల్చుకుంటూ నాటు పడవల్లో ఏరు దాటే సన్నివేశాల్ని ప్రోమోలో చూపించారు. వీటితో పాటు కత్తి పట్టుకొని బన్నీ డాన్స్ చేస్తున్న చిన్న బిట్ ను కూడా చూపించారు. ఈ రెండు షాట్స్ తో పుష్ప ఫస్ట్ లిరికల్ వీడియో ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.

ఈ సాంగ్ ను 13వ తేదీన ఒకేసారి 5 భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఒక్కో భాషలో ఒక్కో ఫేమస్ సింగర్ ఆలపించాడు. ఆ సింగర్లు ఎవరనే విషయాన్ని కూడా ఇప్పటికే బయటపెట్టారు. దాక్కో దాక్కో మేక అనే లిరిక్స్ తో సాగే ఈ పాట టోటల్ సినిమాకే హైలెట్ అంటున్నారు మేకర్స్.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప: ది రైజ్-పార్ట్ 1”. ముత్తంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం కొండలలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. క్రిస్మస్ కానుకగా మొదటి భాగం “పుష్ప: ది రైజ్-పార్ట్ 1″ను డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics