Allu Arjun Pushpa - ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,December 20,2021 - 02:55 by Z_CLU

Allu Arjun’s Pushpa 3 Days Collection

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కేవలం టాలీవుడ్ లోనే కాదు, ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ సినిమా. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ (3 రోజుల్లో) పూర్తి చేసుకున్న ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 173 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

అటు బాలీవుడ్ లో కూడా పుష్ప సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి వీకెండ్ ఈ సినిమాకు 12 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. శుక్రవారం 3 కోట్లు, శనివారం 4 కోట్లు, ఆదివారం 5 కోట్లు.. ఇలా రోజురోజుకు బాలీవుడ్ లో పుష్ప సినిమాకు వసూళ్లు పెరుగుతున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. నైజాంలో ఈ సినిమా 3 రోజుల్లో 28 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. సీడెడ్, ఆంధ్రా అనే తేడా లేకుండా అన్ని సెంటర్లలో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి.

వరల్డ్ వైడ్ పుష్ప సినిమా 145 కోట్ల రూపాయల ప్రీ – రిలీజ్ బిజినెస్ చేసింది. ఏపీ,నైజాంలో 101 కోట్ల రూపాయలకు ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. మరో వారం రోజులు ఇదే ఊపు కొనసాగితే.. పుష్ప సినిమా బ్రేక్ ఈవెన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఏపీ, నైజాం ఫస్ట్ వీకెండ్ (3 రోజులు) షేర్
నైజాం – రూ. 28.50 కోట్లు
సీడెడ్ – రూ. 8.80 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.40 కోట్లు
ఈస్ట్ – రూ. 3.03 కోట్లు
వెస్ట్ – రూ. 2.62 కోట్లు
గుంటూరు – రూ. 3.49 కోట్లు
నెల్లూరూ – రూ. 1.95 కోట్లు
కృష్ణా – రూ. 2.72 కోట్లు