బన్నీ ఫిక్సయ్యాడు... త్వరలోనే సెట్స్ పైకి

Sunday,May 06,2018 - 01:01 by Z_CLU

ప్రస్తుతం ‘నా పేరు సూర్య’తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు బన్నీ… ఈ సినిమా కోసం దాదాపు ఏడాది కేటాయించిన బన్నీ ఇప్పుడు ఫ్రీ అయిపోయాడు. ఇక  స్టైలిష్ స్టార్ నెక్స్ట్ సినిమా  ఎవరితో ఉంటుందా..అనే క్యూరియాసిటీ కి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో ఆన్సర్ ఇవ్వబోతున్నాడట. మొన్నటి వరకూ బన్నీ నెక్స్ట్ సినిమా లిస్టు లో కొరటాల శివ …క్రిష్ పేర్లు వినిపించగా లేటెస్ట్ గా విక్రం కుమార్ తో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయిందనే టాక్ వినిపిస్తుంది.

బన్నీ కోసం ఓ డిఫరెంట్ స్క్రిప్ట్ రెడీ చేసి ఇటివలే గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నాడట విక్రం. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నాడని సమాచారం.ప్రస్తుతం ఫ్యామిలీ తో ఓ వెకేషన్ ప్లాన్ చేసుకుంటున్నాడట బన్నీ.. ఆ ట్రిప్ నుండి తిరిగి రాగానే ఈ సినిమాను స్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది.