బన్నీ నుండి బిగ్ అనౌన్స్మెంట్స్

Sunday,August 19,2018 - 11:12 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఇటివలే తన నెక్స్ట్ సినిమాపై  ఇంకా ఎలాంటి క్లారిటీ లేదని అభిమానులు  కాస్త ఓపిక పట్టాలని చెప్పుకొచ్చాడు బన్నీ… అయితే లేటెస్ట్ గా ‘గీత గోవిందం’ సక్సెస్ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన నిర్మాత బన్నీ వాస్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా గురించి కొన్ని విశేషాలు తెలియజేసాడు .

ప్రస్తుతం బన్నీకు సంబంధించి త్వరలోనే రెండు పెద్ద న్యూస్ లున్నాయి అవి త్వరలోనే అనౌన్స్ చేయనున్నాం. అయితే అవేంటి… నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.. ఇక బన్నీ తమిళ్ ఎంట్రీ కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాం. లింగు స్వామీ -బన్నీ ఇద్దరూ బిజీ గా ఉండటంతో ఆ సినిమా అనౌన్స్ మెంట్ స్టేజ్ లోనే ఉండిపోయింది. త్వరలోనే బన్నీ నటించే తమిళ్ సినిమా గురించి కూడా క్లారిటీ ఇవ్వనున్నాం’ అని తెలిపాడు. సో అతి త్వరలోనే బన్నీ నుండి ఓ రెండు వార్తలు బయటికి రానున్నయన్నమాట.